భక్తిశ్రద్ధలతో మండల పూజ కార్యక్రమాలు

66చూసినవారు
భక్తిశ్రద్ధలతో మండల పూజ కార్యక్రమాలు
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు తుడుం వారి పల్లెలో శనివారం ఓబులేటి నరసింహస్వామి మండల పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అనంత కుమారాచార్యులు 108 కలశాలలో ఉన్న నది జలాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం హోమాది కార్యక్రమాలను నిర్వహించి నరసింహ స్వామికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you