పుంగనూరు అర్బన్ పరిధిలోని సంత గేటులో గల సచివాలయాన్ని గురువారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్ తో పాటు రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అలాగే సచివాలయంలోని ఆధార్ సెంటర్‌ను తనిఖీ చేశారు.