పుంగనూరు: పట్టణంలో చేపలవిక్రయానికి తగిన సౌకర్యం కల్పించాలి

84చూసినవారు
పుంగనూరు పట్టణంలో చేపల విక్రయానికి తగిన సౌకర్యం లేకుండా మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని మత్స్యకార సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్బంగా శనివారం మత్స్య సహకార సంఘం సమావేశం నిర్వహించారు. చేపల విక్రయాలకు ప్రత్యేక భవన సముదాయాన్ని ఏర్పాటు చేయాలని, బెస్తలను ఎస్టీలో చేర్చాలని, మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్