రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డ ఘటన పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు మండలంలోని జాండ్రపేటకు చెందిన వంశీ మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో సోమల వైపు బయలు దేరాడు. గొంగివారిపల్లె పంచాయతీ పరిధిలోని నాగిరెడ్డి చెరువుకట్ట మలుపు వద్ద ఓ ప్రైవేటు బస్సును ఢీకొన్నాడు. ప్రమాదంలో ముగ్గురూ గాయపడ్డారు. గాయపడ్డ వారిని పీలేరుకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.