తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బీఎన్. కండ్రిగ మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వీధులు జలమయమయ్యాయి. వాహనదారులకు ప్రయాణం కష్టతరంగా మారింది. అల్పపీడన ప్రభావానికి తోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఉదయం నుంచి విడతలవారీగా వర్షం కురుస్తోంది.