నాగలాపురంలో వైభవంగా వినాయక నిమజ్జనం

79చూసినవారు
నాగలాపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహానికి గత ఐదు రోజులపాటు విశేష పూజలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం భక్తులకు, ప్రజలకు అన్నదానం చేసిన యువకులు డప్పుల వాయిద్యాలు మధ్య కేరింతలు వేస్తూ ఆనందోత్సాహాల మధ్య వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. వినాయకుని గ్రామోత్సవం అనంతరం నదిలో నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్