సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలోని గోవర్ధనగిరి, రామగిరి, రాజానగరం, పిచ్చాటూరు తదితర గ్రామాలలో మంగళవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. వారం రోజులుగా తీవ్ర ఎండ వేడిమికి, ఉక్కపోతకు అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. ఈ వర్షం వరి పంట సాగు చేస్తున్న రైతన్నలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.