శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఓ పాఠశాలలో గురువారం శ్రీకాళహస్తి ఆర్టీవో దామోదర్ నాయుడు విద్యార్థులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ. ఏటా 170000 మంది రోడ్డు ప్రమాదాలకు గురై దుర్మరణం చెందుతున్నారని, అందులో 40 శాతం బైకు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఆయన కోరారు.