శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ లో శనివారం వైద్యులు వైద్య సిబ్బంది నిరసన ధర్నా నిర్వహించారు. కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచార, హత్య ఘటనను నిరసిస్తూ నిరసన ధర్నా నిర్వహించి, వైద్యులకు రక్షణ కల్పించాలి బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. కలకత్తా లాంటి ఘటనలు పునరావతం కాకుండా వైద్యులపై దాడుల ను , అత్యాచార ఘటనలను నియంత్రించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు.