ఉన్నత చదువు చదివినా జాబ్ రాలేదని ఓ యువతి మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట వీఎం వీధికి చెందిన యువతి(22)ఎంబీఏ చదివింది. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ జాబ్ రాలేదు. మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుంది. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.