సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండల పరిధిలోని గొట్టిప్రోలు గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ స్థానిక పోటీలను స్థానిక సర్పంచ్ పరసా రమణయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ పోటీలు క్రీడాకారులలో ఉత్తేజాన్ని నింపడం కోసమే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.