నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల వ్యాప్తంగా వాతావరణం మారింది. మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం వేళ కారు మబ్బులను అలుముకుని వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా గత రెండు మూడు రోజుల నుంచి రాత్రి సమయంలో ఒక గంట సేపు మోస్తారు వర్షం కురుస్తుంది. పలు గ్రామాల్లో రైతులు ఇప్పటికీ మినుము, సజ్జ, వరి నాట్లు వేశారు. వర్షాలు పడకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.