నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని చెర్లోపల్లి, గంగుల వారి చెరువుపల్లి, శకునాలపల్లి, బిజ్జంపల్లి, అయ్యవారిపల్లి, బూదవాడ తదితర గ్రామాల్లో శుక్రవారం ఉదయం నుంచి తీవ్ర ఎండగా ఉంది. సాయంత్రం సమయంలో ఆకాశంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుని వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. తొలకరి జల్లులు కురిసాయి. గత నాలుగైదు రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోత అల్లాడిపోయిన ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.