21 మెట్ట మండలాలను కలుపుకొని ఉదయగిరిని జిల్లా చేయాలి
నెల్లూరు జిల్లా కేంద్రానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరి ప్రాంతం ఎన్నో ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకబడింది. ఉదయగిరి చుట్టుపక్కల మెట్ట ప్రాంతాలను కలుపుకొని జిల్లాగా ప్రకటిస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఉదయగిరి జిల్లా సాధన కమిటీ సభ్యులు అన్నారు. ఆదివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ 21 మెట్ట మండలాలను కలిపి ఉదయగిరి జిల్లాగా చేయాలన్నారు.