నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా
నెల్లూరు జిల్లాలో రోజురోజుకు అక్రమ ఇసుక రవాణా ఎక్కువవుతుంది. తాజాగా కొండాపురం మండలం లింగన్నపాలెంలో మిడత వాగు నుంచి ఆదివారం తెల్లవారుజామున మూడు ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మహేంద్ర తన సిబ్బందితో అక్కడికి వెళ్లి ట్రాక్టర్లను సీజ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.