తిరువూరు పంచాయతీ ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. గత వంద రోజుల్లోనే టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు తీవ్ర వివాదస్పదమైంది. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం కొలికపూడిని పిలిపించి మాట్లాడింది. తన వల్ల అందరికి ఇబ్బందులు వస్తాయని ఊహించలేదని ఆయన అన్నారు. తన వల్ల తలెత్తిన ఇబ్బందులు సరిచేసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఆదివారం పార్టీ ప్రతినిధుల ఆధ్వర్యంలో తిరువూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు.