మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు శనివారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజలు, కార్యకర్తల నుంచి సీఎం వినతి పత్రాలు స్వీకరిస్తారు. కాగా, రోజుకొక ప్రజాప్రతినిధి, టీడీపీ నేత కలిసి కొన్ని వారాలుగా ప్రజా దర్బార్‌లో వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. 50 రోజుల్లో 10 వేల ఆర్జీలు వచ్చాయి.