సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రేపు, ఎల్లుండి పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కుప్పం చేరుకోనున్న సీఎం, అక్కడ అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. రాత్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు. ఎల్లుండి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకుంటారు.