ట్రెండింగ్‌ టాపిక్‌.. చంద్రబాబు టోపీ!

80చూసినవారు
ట్రెండింగ్‌ టాపిక్‌.. చంద్రబాబు టోపీ!
ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్, చంద్రబాబు రోజుకు మూడు సభలు నిర్వహిస్తున్నారు. మండు వేసవి, తీవ్ర వడగాడ్పులను లెక్క చేయకుండా చంద్రబాబు ప్రచారం చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా ఆయన సభల్లో ఒక ప్రత్యేక టోపీని పెట్టుకొస్తుండటంపై ఆసక్తి నెలకొంది. ఈ టోపీ చల్లదనాన్ని అందిస్తోందని చెబుతున్నారు. ఉష్ణోగ్రతల బారినుంచి తలను కాపాడుకోవడానికి ఈ టోపీ ఉపయోగపడుతుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్