బాలికపై దాడి కేసులో పెద్ద ట్విస్ట్‌ను తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు బయటపెట్టారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మోటారు సైకిల్‌పై ఇద్దరు వచ్చి తనను అడ్డగించారని, మత్తు మందు తాగించి, అత్యాచారం చేశారని బాలిక చెప్పిన మాటల్లో నిజం లేదన్నారు. ‘ఈనెల 4న ఎలమందగడ్డలో ఓ బాలిక తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లింది. తల్లిదండ్రులు ఆమెను వెతకడంతో స్నేహితుడిని కాపాడేందుకు కట్టుకథ అల్లింది’ అని ఎస్పీ తెలిపారు.