శృంగవరపుకోటలో వైసీపీకి ఊహించని షాక్

1018చూసినవారు
శృంగవరపుకోట నియోజకవర్గంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. అమరావతిలో ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి సుధారాజు 150 మంది అనుచరులతో నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారిలో 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కన్వీనర్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్.కోట ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్.కోటను కబ్జాల కోటగా మార్చారని విమర్శించారు. కాగా ఎమ్మెల్సీ రఘురాజు మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్