భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలోనే చిట్టినగర్‌లో ఉన్న విజయ డెయిరీ కూడా నీట మునిగింది. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఆదివారం రాత్రి వరద ఉధృతి పెరగడంతో విజయ డెయిరీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. డెయిరీకి సంబంధించిన మెషిన్లు, వాహనాలు కూడా ముంపునకు గురయ్యాయి. దీంతో సుమారు రూ.70 కోట్ల మేర నష్టం వాటిల్లింది.