జామి: వర్షానికి కూలిన విద్యుత్ స్తంభం..

65చూసినవారు
జామి: వర్షానికి కూలిన విద్యుత్ స్తంభం..
మండల కేంద్రం జామి స్థానిక గండి వీధిలో సోమవారం కురిసిన భారీ వర్షానికి విద్యుత్ స్థంభం నేలకొరిగింది. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరాను అందించారు. సకాలంలో విద్యుత్ సరఫరా అందించినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్