పార్వతీపురం: మున్సిపల్ చైర్ పర్సన్ కు వినతిపత్రం అందజేత
పార్వతీపురం మున్సిపల్ చైర్ పర్సన్ బి. గౌరీశ్వరి ఇంటి వద్ద ఆదివారం సిఐటియు నాయకులు గొర్లి వెంకటరమణ, మున్సిపల్ కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. వెంకటరమణ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని స్థానిక సంస్థలపై చట్టబద్ధమైన సెలవులు, పనిముట్లు, రక్షణ పరికరాలు, వారాంతపు సెలవులు అమలు కావడం లేదని ఈనెల 28వ తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాలు, కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు.