పార్వతీపురం స్థానిక బైపాస్ రోడ్ లోని ఆల్ ఇండియా శిష్టకరణ ఓబీసీ సాధన కమిటీ కో- కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ్ ఆఫీసులో గురువారం శిష్టకరణ సంఘ అధ్యక్షులు బెహరా గుంపస్వామి అధ్యక్షతన పిక్నిక్ నిర్వహణ ప్రధాన అంశంగా సమావేశం జరిగింది. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని వచ్చే నెల నవంబర్ 24న గతంలో మాదిరిగానే సీతారాంపురం తోటలో పిక్నిక్ నిర్వహించుటకు తీర్మానించారు.