పార్వతీపురం: ఎల్ఐసి ఆఫీసు వద్ద ఏజెంట్లు ధర్నా

79చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లా స్థానిక ఎల్ఐసి ఆఫీస్ వద్ద మంగళవారం ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. పాత ఇన్సూరెన్స్ పాలసీల పద్ధతిని కొనసాగించాలి, కొత్త పద్ధతిని రద్దు చేయాలి,పాలసీ హోల్డర్స్ బోనస్ రేట్లు పెంచాలి, జీఎస్టీ ని రద్దు చేయాలి, అని నినాదాలు చేశారు. లియాఫీ యూనియన్ నాయకులు ఎల్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఈనెల 28న ఎల్ఐసి ఆఫీస్ వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లియాఫి నాయకులు జీజే నాయుడు, కే మురళి, బి త్రినాధ, ఏజెంట్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్