భామిని మండలంలోని ఘనసర గ్రామంలో దసరా పండుగను కొన్ని అనివార్య కారణాలు వలన ఆదివారం నిర్వహించారు. మేళతాళాలతో ఉరేగింపుగా గ్రామ దేవత వద్దకు వెళ్లి ముర్రాట పోసి, నైవేద్యాలు సమర్పించి గ్రామస్థులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా రైతులు పత్రి కొమ్మలను గ్రామ దేవత వద్దకు తీసుకెళ్లి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోని పత్రి కొమ్మలను తమ వ్యవసాయ పొలాల్లో పాతే కార్యక్రమం చేశారు.