పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల ముఖ్య అధికారులతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ. పది మంది గిరిజనులు నివసిస్తున్న గ్రామానికి కూడా తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనుల విద్య వైద్యం మౌలిక సదుపాయాలు కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మన్యంలో జిల్లా అధికారులు ప్రజా ఫిర్యాదులపై చక్కగా స్పందిస్తున్నారని అధికారులను అభినందించారు.