రేగిడి మండల కేంద్రం మాజీ జడ్పిటిసి కిమిడి రామకృష్ణం నాయుడును విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్ శనివారం రామకృష్ణం నాయుడును అయన స్వగ్రామం రేగిడిలో కలిశారు. టిడిపి నుంచి వైసీపీలోకి రావాలని కోరారు. ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వీరితోపాటు రేగిడి మండల వైస్ ఎంపీపీ అచ్చెంనాయుడు, జగన్ ఉన్నారు.