రేగిడి మండలంలోని అప్పాపురం పంచాయతీలో ఏడుగురు వాలంటీర్లు సోమవారం రాజీనామా పత్రాలను పంచాయతీ కార్యదర్శికి స్వాతికి సమర్పించారు. తమ రాజీనామాను ఆమోదం తెలపాలని కోరారు. కూటమి మాటలు భరించలేక రాజీనామా పత్రాలు అందజేశామన్నారు. ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేసిన వాలంటీర్లపై అపవాదు రావడంతో ఈ పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ప్రజల్లోకి వెళ్తామన్నారు.