ఘనంగా శ్రీ దార గంగమ్మ తల్లి పండగ చాటింపు కార్యక్రమం

77చూసినవారు
ఎస్ కోట పట్టణ ప్రజల గ్రామదేవత శ్రీ ధార గంగమ్మ తల్లి పండగ చాటింపు కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా చేపట్టారు. ముందుగా ఆలయ అనువంశిక పూజారి మోపాడ గౌరి నాయుడు సమక్షంలో అమ్మవారి సన్నిధిలో డప్పు కొట్టి పండగ చాటింపు వేశారు. అనంతరం గ్రామ పురవీధుల్లో డప్పు కొట్టి పండగ చాటింపు వేశారు. ఈనెల 26న అమ్మవారి నిజరూప దర్శనం, 27న తొలేళ్ళు, 28న పండగ అనుపోత్సవం జరుగుతుందని అనువంశిక పూజారి గౌరి నాయుడు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్