గురువారం విజయనగరం జిల్లా కోర్టు దగ్గర ఉన్న ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈడి జోన్ -2 రవికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుబావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. దేశానికి త్యాగమూర్తుల చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివన్నారు.