చేనేత వస్త్రాలకు ప్రాధాన్యతనివ్వాలి -- ఎంపి కలిశెట్డి

71చూసినవారు
చేనేత వస్త్రాలకు ప్రాధాన్యతనివ్వాలి -- ఎంపి కలిశెట్డి
భారతదేశంలో చేనేత పరిశ్రమను ప్రోత్సహించడం కోసం తాను ప్రతి శుక్రవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని, అలాగే పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడైనా సరే శుక్రవారం రోజున చేనేత వస్త్రాలను ధరించి సమావేశాలకు వెళ్లనున్నట్టు విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పల నాయుడు ఆదివారం పేర్కొన్నారు. చేనేత పరిశ్రమ మనుగడ సాగించాలంటే ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్