విజయవాడ: కలకలం రేపిన టీడీపీ నాయకుడు రవీంద్ర ఆత్మహత్య

84చూసినవారు
విజయవాడ: కలకలం రేపిన టీడీపీ నాయకుడు రవీంద్ర ఆత్మహత్య
అప్పులు బాధలు, వైసీపీ నేతల వేధింపుల కారణంగా గొల్లపూడిలో టీడీపీ నాయకుడు కారంపూడి రవీంద్ర ఆత్మహత్య కలకలం రేపుతోంది. తన బాధను వివరిస్తూ వీడియోను విడుదల చేసి మరీ రవీంద్ర బవన్మరణానికి పాల్పడ్డాడు. 12 ఏళ్లుగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని రవీంద్ర వీడియోలో తెలిపాడు. గత వైసీపీ ప్రభుత్వంలో తనకు రావాల్సిన డబ్బులు రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అప్పులు కట్టకపోవడంతో జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు చెప్పాడు. అప్పులు వాళ్లు ఇంటికి వచ్చి బూతులు తిడుతున్నారని.. పిల్లలు కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని అన్నాడు.

సంబంధిత పోస్ట్