అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో నలుగురిని అరెస్టు చేసినట్లు బాడంగి సీ.ఐ నారాయణరావు శనివారం తెలిపారు. రావివలస చెరువు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా వాడాడ గ్రామానికి చెందిన శంకర్ రావు, రాఘవరావు బైక్ తనిఖీ చేయగా 298 మద్యం సీసాలు లభించినట్లు తెలిపారు. విచారించగా బాడంగి మద్యం దుకాణంలో సూపర్వైజర్ బాలాజీ రావు, సేల్స్ మెన్ సహకారంతో ఒక సీసాపై రూ.20లు అదనంగా తెచ్చినట్లు వారు తెలిపారు.