బాడంగి: వైసీపీ నాయకునికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

79చూసినవారు
బాడంగి: వైసీపీ నాయకునికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
బాడంగికి చెందిన వైసిపి నాయకుడు ముగడ వెంకటరమణ కాలికి బలమైన గాయం కావడంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆయన్ని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈయన వెంట జడ్పీటీసీ పెద్దింటి రామారావు, వైసీపీ నాయకులు లక్ష్యుమ్ నాయుడు, శంకరరావు, సింహాచలం తిరుపతి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్