త్వరితగతిన పెద్దగెడ్డ పనులు

71చూసినవారు
త్వరితగతిన పెద్దగెడ్డ పనులు
రామభద్రపురం మండల పరిధిలో జన్నివలస గ్రామంలో సుమారు 3వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశ్యంతో పెద్దగెడ్డ కాలువ నిర్మాణం చేపట్టారు. గత అయిదేళ్లుగా ఎటువంటి పూడికలు తీయకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయి సాగునీరు రాని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే బేబీనాయనకు రైతులు సమస్యను వివరించడంతో. తన సొంత నిధులు వెచ్చించి యంత్రాలు ఏర్పాటు చేసి, ఇరిగేషన్ డీఈఈ కనకారావు ఆధ్వర్యంలో పూడికతీత పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్