బొబ్బిలి: విశాఖ డెయిరీ పాల ధరలను పెంచాలి

51చూసినవారు
రామభద్రపురం మండల కేంద్రంలో గురువారం రైతు సంఘం రాష్ట్ర నేత మర్రాపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విశాఖ డెయిరీ తగ్గించిన పాల ధరలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేసారు. పాల ధరను తగ్గించడం వలన పాల రైతులు నష్టపోతున్నారన్నారు. డిసెంబర్ 2న విశాఖ డెయిరీ ముట్టడికి తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రాంబాబు, గోపాలం, శ్రీనివాస్ తదితరులు పాల్గున్నారు.

సంబంధిత పోస్ట్