అభిమాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అవయవదాన సేవా కార్యక్రమంలో భాగంగా తమ మరణాంతరం అవయవాల దానానికి బొబ్బిలి పట్టణంలోని గొల్ల వీధికి చెందిన పలువురు యువకులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత సంస్థ ప్రతినిధులకు అవయవదాన ప్రతిజ్ఞ పత్రాలను ఆదివారం సమర్పించారు. అవయవదానానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నక్కెన మాధవ్ తదితరులు పాల్గొన్నారు.