ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన మద్యంపాలసీ ప్రకారం రెండేళ్లకు కొత్త షాపులను పెట్టేందుకు దరఖాస్తులు చేసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉందని సీతానగరం ఎక్సైజ్ సర్కిల్ సిఐ పద్మావతి తెలిపారు. సోమవారం సాయంత్రం నాటికి సీతానగరం మండలంలోని నాలుగు షాపులకు 26, బలిజిపేట మండలంలోని ఐదుషాపులకు 8, గరుగుబిల్లి మండలంలోని మూడు షాపులకు 17 దరఖాస్తులు అందినట్లు ఆమె తెలిపారు.