బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్ వి రమణమూర్తి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయం కోసం గ్రీన్ బెల్ట్ సభ్యులు వద్దనుండి రూ. 22,000 విరాళాలను సేకరించారు. మంగళవారం సాయంత్రం చెక్కును బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొంచాడ సత్యరాజు, ఎం వెంకట నాయుడు, సిహెచ్ అప్పలనాయుడు, ఎం సింహాచలం, విఎన్ శర్మ పాల్గొన్నారు.