గుర్ల మండలంలో డయేరియా వ్యాధికి గురై చికిత్స పొందుతున్న డయేరియా రోగులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పరామర్శించారు. అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎస్ ఎస్ ఆర్ పేట మంచినీటి పథకాన్ని పరిశీలించారు. డయేరియా వ్యాధి నిర్మూలనకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.