రాష్ట్ర హోం శాఖ, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి వంగలపూడి అనిత గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నట్టు జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం సాయంత్రం 4గంటలకు కలెక్టర్ కార్యాలయం జిల్లా అధికారులతో సమీక్షిస్తారని పేర్కొన్నారు.