గషేష్ నిమజ్జనంలో కమిటీలు అప్రమత్తంగా ఉండాలి

2100చూసినవారు
గషేష్ నిమజ్జనంలో కమిటీలు అప్రమత్తంగా ఉండాలి
గణేష్ నిమజ్జనంలో కమిటీలు అప్రమత్తంగా ఉండాలని ముందుగా పోలీసులకు తెలియజేయాలని బుదరాయవలస ఎస్సై నవీన్ పడాల్ అన్నారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాం రామాలయం వద్ద గణేష్ నిమజ్జనం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నవీన్ పడాల్ మాటాడుతూ ముఖ్యంగా యువత ఎటువంటి తగాగాదాలలో తలదూర్చరాదన్నారు. అలా జరిగితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. నిమజ్జన‌ సమయంలో ఎటువంటి సమస్య ఉన్నా నేరగా తనకు తెలయజేయాలి అన్నారు. అలా కాకుండా సమస్యను వివాదస్పదం చేయరాదని అన్నారు. తమ సిబ్బందికి సహకరిస్తే నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిపేందుకు పోలీసులు సహకరిస్తారన్నారు. మందుగుండు సామగ్రి పేల్చేందుకు ఎటువంటి అనుమతి లేదన్నారు. పులి సంచారం పై గ్రామస్థులు ఎస్సై వద్ద ప్రస్థావించగా పులి సంచరిస్తుందని రోజుకు సుమారు 40 మైల్లు ప్రయాణిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాడ్డి వేణుగోపాలరావు, సత్తారు శ్రీను, తాడ్డి శ్రీధర్, పలు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్