తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ భైరిపురం సర్పంచ్ పాప్పల కృష్ణకి గర్భం ప్రాథమిక వైద్య కేంద్రం 104 సిబ్బంది శనివారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు గంగు నాయుడు, గౌరి నాయుడు మాట్లాడుతూ తమకి నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించక కుటుంబాలను పోషించటం చాక కష్టం అవుతుందని వాపోయారు. 104 సేవలను ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు.