విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాం మండలంలో సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అభివృద్ధి కార్యాలయం, తహశీల్దారు కార్యాలయంలలో ఎంపిపి తాడ్డి కృష్ణవేణి పతాకావిష్కరణ గావించారు. బుదరాయవలస పోలీస్ స్టేషన్ లో ఎస్సై నవీన్ పడాల్ , గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆయా పాఠశాల అభివృద్ధి కమిటి అధ్యక్షులు పతాక ఆవష్కరణ గావించారు. అనంతరం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిపి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాలను గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రామకృష్ణ, తహశీల్దారు రత్నాకర్, పలువురు నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.