గ్రంధాలయ వారోత్సవాలలో బాగంగా మెరకముడిదాం గ్రంధాలయ లైబ్రేరియన్ బుచ్చింనాయుడు సోమవారం స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు వ్యాచరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. విద్యార్ధులు జ్ఞాన సముపార్జనకు సెలవు రోజులలో గ్రంధాలయానికి వెళ్ళాలని ప్రధానోపాధ్యాయులు ఎల్ పరిశినాయుడు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.