విజ్ఞాన్ లో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

80చూసినవారు
విజ్ఞాన్ లో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు
చీపురుపల్లి మండలంలో ఉన్న విజ్ఞాన్ పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్ జయంతిని పురస్కరించుకొని గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పెట్టిన టాలెంట్ టెస్ట్ లో ర్యాంక్ లు సాధించిన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందించారు. విద్యార్థులు తయారుచేసిన వివిధ ప్రొజెక్ట్ లను గురించి విద్యార్థులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పి జ్యోతి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్