బొండపల్లి: నెలివాడ చెరువు వద్ద లారీ బోల్తా

62చూసినవారు
బొండపల్లి: నెలివాడ చెరువు వద్ద లారీ బోల్తా
బొండపల్లి మండలం నెలివాడ చెరువు మలుపు వద్ద ఆదివారం అదుపు తప్పి లారీ బోల్తా పడింది. జాతీయ రహదారిపై లారీ తిరగబడడంతో రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్రేన్‌ల సహాయంతో లారీని తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎస్సై యు. మహేశ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్