దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం గ్రామంలో చీరకు నిప్పంటుకొని సోమవారం మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన సారిక సింహాచలంకు చుట్ట కాల్చే అలవాటు ఉందని, ఈ క్రమంలో అగ్గి బట్టలకు అంటుకొని ప్రమాదం సంభవించినట్లు సోదరుడు రౌతు సింహాచలం పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయపడిన సింహాచలాన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.